ఒంగోలులో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్vకలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని కొనియాడారు. ఈ దిశగా ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి అంబేద్కర్ ఇచ్చారని, ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ప్రపంచం మొత్తం మేధావిగా కొనియాడుతున్న ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు