గుంతకల్లు: గుత్తి అర్ఎస్ కు చెందిన విజయలక్ష్మి హత్య కేసులో భార్య, భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆటో, కమ్మలు స్వాధీనం
అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ లో జరిగిన విజయలక్ష్మి అనే మహిళ హత్య కేసును పోలీసులు చేదించారు. హత్య చేసిన భార్య, భర్తలను గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. గుత్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ లు కేసు వివరాలను వెల్లడించారు. గుత్తి ఆర్ఎస్ కు చెందిన విజయలక్ష్మి అలియాస్ రెడ్డమ్మకు చెందిన ఇంట్లో గుత్తి ఆర్ఎస్ కు చెందిన ఆటో డ్రైవర్ బంధాల రాము, అలీసమ్మలు అద్దెకు ఉండేవారు. తమకున్న డబ్బు అవసరాల నిమిత్తం విజయలక్ష్మిని హత్య చేసి బంగారు దోచుకున్నారు