మెదక్: మూల విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
Medak, Medak | Sep 17, 2025 నిజాంపేట మండల కేంద్రంలో మూల విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బ్రహ్మం గారి ఆలయ ప్రాంగణం వద్ద విశ్వకర్మ చిత్రపటానికి ఉంచి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండాను ఆవిష్కరించామన్నారు. విశ్వకర్మ భగవానుడు జయంతి రోజున పరిశ్రమలు కర్మాగారాలు అన్ని రకాల యంత్రాలకు పూజ చేస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వం విశ్వకర్మలను గుర్తించలేదని ఇప్పుడున్న ప్రభుత్వం అయినా విశ్వకర్మలను గుర్తించి విశ్వకర్మల సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.