ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని విశ్వకర్మ యోజన సెంటర్ నందు పట్టణ అధ్యక్షులు రూరల్ అధ్యక్షులు సేవా పక్వాడ మండల ఇన్చార్జి శరత్ చంద్ర కుమార్ ల ఆధ్వర్యంలో దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ మాట్లాడుతూ అంత్యోదయ అని నినాదంతో చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి అందించడమే లక్ష్యంగా చేసుకుని నిరంతరం కృషి చేస్తూ 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఏకైక నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారూ