ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొనిజేడులో శుక్రవారం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన వసతులను ప్రభుత్వం తగు రీతిలో సమకూర్చిందన్నారు. ఎక్కువ సమయం పాఠశాలల్లో గడుపుతున్న విద్యార్థుల గుణగణాలను ఉపాధ్యా యులతో చర్చించి తల్లిదండ్రులు తెలుసుకునేందుకు ఇలాంటి ఆత్మీయ సమావేశాలు అవసరమన్నారు.