కందుకూరు శ్రీనగర్ కాలనీలో డెంగ్యూతో మరణించాడని భావిస్తున్న డాలు సింహమణి కుటుంబ సభ్యులను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ నేతి మహేశ్వరావు మంగళవారం పరామర్శించారు. ఏడాదిలోపు తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోయి అనాధలైన ఇద్దరు మైనర్ ఆడపిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. MLA ఇంటూరి చొరవ తీసుకుని సహాయం చేయాలన్నారు. కందుకూరు ఏరియా హాస్పిటల్లో డెంగ్యూ వ్యాధికి తగిన చికిత్స సౌకర్యం కల్పించాలని కోరారు.