పుట్టపర్తిలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలోని హనుమాన్ సర్కిల్లో బుధవారం మధ్యాహ్నం బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ పట్టణ కన్వీనర్ కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. భారత్ మాతాకీ జై, నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కొండమ రాజు, హరికృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.