కర్నూలు: సచివాలయ ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ వేధింపులు ఆపాలి: సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు డ
సచివాలయ ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ వేధింపులు ఆపాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూల్ లో సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులపై వేధింపులు తగదన్నారు. మున్సిపల్ సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉద్యోగులపై పని భారం తగ్గించాలన్నారు. సచివాలయం ఉద్యోగులపై పని వేధింపులు ఆపాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.