గద్వాల్: కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ జితేందర్ రెడ్డి
గద్వాల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి & ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఎ.పి. జితేందర్ రెడ్డి పోలీసులు వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ తల్లి,తెలంగాణ అమర వీరుల చిత్త పటానికి పూలమాలలు వేశారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.