వికారాబాద్: RRR లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ తో మాట్లాడిన కేటీఆర్
వికారాబాద్ జిల్లా పరిధిలో మూమెంట్ పేట్ మండలంలో పలు గ్రామాలతో పాటు నవాబుపేట పూడూరు మండలాల్లో రైతులు త్రిబుల్ ఆర్ లో అలైన్మెంట్ మార్చడం వల్ల భూమి కోల్పోతున్నారని, అక్కడ మార్కెట్ లో ఉన్న రేటు ప్రకారం రైతులకు నష్టపరిహారం కట్టించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జెన్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.