ఇబ్రహీంపట్నం: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి
లింగోజిగూడ డివిజన్లోని సాయిరాం నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును ఆదివారం మధ్యాహ్నం కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సీసీ రోడ్డుతో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలు తగ్గుతాయని రాబోయే రోజుల్లో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని. కాలనీ వాసులకు అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. డివిజన్ ను బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు.