బేతంచెర్ల లో శివపార్వతులకు వైభవంగా పల్లకి సేవ
Dhone, Nandyal | Nov 5, 2025 కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బేతంచెర్లలోని పూదోట ఆశ్రమంలో శివపార్వతులకు బుధవారం రాత్రి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఒకవైపు జ్వాలాతోరణం వెలుగుల మధ్య శివనామ స్మరణలతో స్వామి, అమ్మవార్లను పల్లకిలో కొలువుంచి భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఆయా కాలనీలో చెందిన మహిళలు సామూహికంగా ఉసిరిక చెట్టు, బేతేశ్వర శివలింగం ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.