మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో కొండచిలువ కలకలం లేపింది.గ్రామం లోని పాత బ్యాంకు బజార్లో కొండచిలువ ఇంటి పరిసరాల్లో ఉండగా స్థానిక ప్రజలు చూసి భయభ్రాంతులకు గురి అయ్యారు.స్థానిక కాలనీవాసులు మహానంది అయ్యన్న నగర్ కు చెందిన స్నేక్ క్యాచర్ మోహన్ సమాచారం ఇవ్వగా చాకచక్యంగా కొండచిలువను పట్టుకొని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండచిలువ ను బంధించడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు,