ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ డివిజన్లో నూతన సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
హయత్ నగర్ డివిజన్లోని శిరిడీనగర్ కాలనీలో నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులను కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని అన్నారు. అదేవిధంగా సిసి రోడ్ నిర్మాణంతో ప్రజలకు రాకపోకలు సౌలభ్యం కలుగుతుందని అలాగే కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ లైటింగ్ తదితర సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.