హిమాయత్ నగర్: రవీంద్ర భారతి లో భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
రవీంద్ర భారతిలో హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం సీతారాముల కళ్యాణం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం మధ్యాహ్నం పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం ప్రజలకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించే ధార్మిక కార్యక్రమమని అన్నారు. ఈ కార్యక్రమంలో హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మారగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.