పటాన్చెరు: తెలంగాణ రాష్ట్రంలోని అతి ఎత్తైన గోపురం నిర్మాణ పనుల పరిశీలన : ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రంగా బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం విరాజిల్లుతుంది. 12 కోట్ల రూపాయలతో 150 అడుగుల రాజగోపుర నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. బుధవారం ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న రాజగోపురం నిర్మాణ పనులను ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. భక్తులు, దాతల సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద రాజగోపురాన్ని నిర్మిస్తున్నామని అయన తెలిపారు.