మార్కాపురం: లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా శ్రీనివాసరెడ్డి బాధ్యతల స్వీకరణ
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం అమ్మవారి పల్లి గ్రామ సమీపంలో వెలిసిన యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా గోలమారి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన చెన్నకేశవ స్వామి దేవస్థానం ఈవోగా కూడా పనిచేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టారు. దాతలు భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీనివాస రెడ్డి తెలిపారు.