నారాయణపేట్: ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో బుధవారం 9:30 గం సమయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ క్రీడా శాఖ మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ యోగేష్ గౌతం వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.