పటాన్చెరు: అదృశ్యమైన యువకుడు శవమై బొల్లారం మాధవని కుంటలో తేలాడు
అదృశ్యమైన యువకుడు శవమై తేలిన ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ బండకు చెందిన రాజాసింగ్ (32) ఈనెల 21న కనిపించడం లేదని కుటుంబ సభ్యులు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేశారు. 2 రోజు లుగా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీ ఎంతవెతికినా లభించలేదు. దీంతో ఆదివా రం మాధవానికుంటలో మృతదేహం కనిపిం చడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం తెలు సుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్. రఘు నందన్, పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్తో కలి సి ఘటన స్థలాన్ని సందర్శించారు.