నారాయణపేట్: యూరియా కోసం రైతుల రాస్తారోకో ధర్నా
నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం అందాజ ఉదయం ఏడున్నర గంటల నుండి రైతులు యూరియా కోసం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా రాస్తారోకో కార్యక్రమానికి టియుసిఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు రైతులు యూరియా కోసం బారులు తీసి నిలిచినను ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా రాస్తారోకో దగ్గరకు కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు. వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ చేరుకొని రేపు బుధవారం ప్రతి ఒక్కరికి రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేస్తామని తెలపడంతో రైతులు ధర్నా రాస్తారోకోను విరమింప చేశారు.