రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో భాగంగా భగీరథ కెమికల్స్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ సింగవరపు చంద్రశేఖర్ సూచనల మేరకు SKR చారిటబుల్ ట్రస్ట్ సర్వేరెడ్డి పాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.. దత్తతలో భాగంగాగ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను నిర్మించారు. నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజబాబు , ఒంగోల్ మేయర్ గంగాడ సుజాత పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య AMC చైర్మన్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు