దర్యాప్తు లో ఉన్న శారీరిక నేరాలు, దొంగతనం, గంజాయి మరియు ఇతర గ్రేవ్ కేసులు,కేసుల గుడ్ ట్రయల్ మానిటరింగ్, ఎన్ఫోర్స్మెంట్/ రోడ్డు ప్రమాదాలు మరియు తదితర అంశాలపై జిల్లా పోలీస్ కార్యాలయ నుండి ఒంగోలు, దర్శి, కనిగిరి మరియు మార్కాపురం సబ్ డివిజన్ ల డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి ఆయా కేసుల సత్వర పరిష్కారంకు దోహదపడే విధంగా తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సమావేశంలో గ్రేవ్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని, సమగ్ర దర్యాప్తు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిలను అరెస్ట్ చేసి శిక్షలు పడే విధంగా చూడాలన్నారు.