లింగోజిగూడ డివిజన్ పరిధిలోని కృష్ణా నగర్ లో 34 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఆదివారం మధ్యాహ్నం కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం కావడం వల్ల లింగోజిగూడ డివిజన్ అభివృద్ధికి కోట్ల రూపాయలు రావడం జరుగుతుందని అన్నారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులతోనే ఈ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని అన్నారు.