ప్లాస్టిక్ రహిత సమాజం కోసంస్వచ్ఛతాహి కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
స్వచ్ఛతాహీ సేవ-2025 కార్యక్రమంలో భాగంగా బుధవారం చిత్తూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతోత్సవ్ ర్యాలీని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు ప్రారంభించారు. గాంధీ విగ్రహం కూడలి నుంచి ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం, వ్యక్తిగత శుభ్రత అంశాలపై అవగాహన కల్పిస్తూ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నగరపాలక ఉద్యోగులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా, అందంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, కమిషనర్ పి నరసింహ ప్రసాద్, సహాయ