ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్ లో ఉన్న టిడిపి పార్టీ కార్యాలయం నందు 84 మంది లబ్ధిదారులకు 85 లక్షల 64 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ను స్థానిక ఎమ్మెల్యే మరియు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఏదైనా కారణాలవల్ల వైద్య ఖర్చు ముఖ్యమంత్రి సహాయనిధి కింద నిధులను అందజేసి వారి కుటుంబాలను ఆదుకుంటుందన్నారు ప్రజల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం మన అదృష్టం అన్నారు