నిజామాబాద్ రూరల్: జక్రాన్ పల్లి లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్: డిచ్పల్లి సిఐ వినోద్
జక్రాన్ పల్లి లో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిచ్పల్లి సీఐ వినోద్ తెలిపారు. మంగళవారం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాలిక్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివరాలను వెల్లడించారు. గాంధీనగర్‌లో వాహన తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో, గత నెల 18న బస్టాండ్ వద్ద బైకు దొంగతనం చేసినట్లు వారు ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.