ఆళ్లగడ్డలోని శ్రీ కాళికామాత ఆలయ ఆవరణంలో, విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఆళ్లగడ్డలోని శ్రీ కాళికామాత ఆలయ ఆవరణంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు చంద్రశేఖర ఆచార్యులు హోమం నిర్వహించగా, ఆలయ కమిటీ సభ్యులు, కె.విజయకుమారు ఆచారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రామాచారి, రాధమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.