ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి నిధులు కేటాయింపు మరియు ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని విద్యార్థి జేఏసీ నాయకుడు రాయపడి జగదీష్ తెలిపారు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పాటయ్య ఆరు సంవత్సరాలైనా పూర్తిస్థాయి ఇన్ఫాస్ట్రక్చర్ మరియు వసతులను ఏర్పాటు చేయలేదన్నారు దీనికి నిరసనగా డిసెంబర్ 4వ తేదీన అన్ని విద్యాసంస్థల బందుకు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చినట్లు తెలియజేశారు