నారాయణపేట్: అక్షయపాత్ర వద్దు వంట శాలలు ముద్దు: ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. సంతోష్
నారాయణపేట జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు మంగళవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. సంతోష్ మాట్లాడుతూ అక్షయపాత్ర వద్దు వంటశాలలే ముద్దు అని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కార్మికులకు వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరారు.