హోంగార్డుల వ్యవస్థాపక 63వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు హోంగార్డుల సేవలను కొనియాడారు. శనివారం నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో కేవలం రూ.2 రోజు వేతనంతో ప్రారంభమైన వారి సేవలు నీటికి గణనీయంగా మార్పులు చెందాయని ఎన్నో విపత్తుల సమయంలో వారు రక్షణగా నిలిచారని హోం గార్డులను ప్రశంసించారు. పోలీసులకు సమానంగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్పి అన్నారు.