ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని నెరవేరుస్తున్నామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని లోతువానిగుంతలో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు పెన్షన్ నగదును పెంచి ఇస్తుందని తెలిపారు. అనంతరం నాయుడుపేటలోని పిఎసిఎస్ గోడౌన్లో రైతులకు యూరియా పంపిణీ చేశారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంల