అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామంలో శుక్రవారం పయ్యావుల సోదరుల ఆధ్వర్యంలో ఎల్.వి కంటి ఆసుపత్రి బళ్లారి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో మొత్తం 58 మంది సభ్యులకు స్క్రీనింగ్ పరీక్ష చేసి 22 మంది సభ్యులకు కంటిశుక్లం ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్లు అవసరమని గుర్తించమని కంటి వైద్య నిపుణులు మారెన్న, కరి బసవలు పేర్కొన్నారు. 8 మంది సభ్యులకు సాధారణ దృష్టి లోపానికి కంటి అద్దాలు అవసరమని నిర్ధారించారు. అదనంగా, యర్రగుడి ప్రాథమిక పాఠశాలలో, 66 మంది పిల్లలను స్క్రీనింగ్ చేశారు.