హిమాయత్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిన రోజు దగ్గర్లోనే ఉంది: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
హిమాయత్ నగర్ లోని లిబర్టీ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు సోమవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేశారని అన్నారు. బీసీలపై చిన్నచూపు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిన రోజు దగ్గరలోనే ఉందని ఆయన తెలిపారు.