24న విజయవాడలో జరిగే దళిత రణభేరి విజయవంతం చేయాలని బి.ఎస్.పి ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో బిఎస్పి ఆధ్వర్యంలో విజయవాడలో ఈనెల 24వ తేదీన జరగనున్న దళిత రణభేరిని విజయవంతం చేయాలని కోరుతూ బిఎస్పి నాయకులు బుధవారం పోస్టర్ల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి, వైసిపి పార్టీల అరాచక పాలన విధానాలను నిరసిస్తూ దళిత రణభేరి చేపట్టినామని, పెద్ద సంఖ్యలో బహుజనులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.