ఆదివారం రోజున ఉప్పల్ మినీ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సాంప్రదాయ డాన్స్ క్రియేషన్స్ కెనడా నుండి విచ్చేసిన కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. స్వజన కూచిపూడి ఆర్ట్ అకాడమీ శ్రీవల్లి వాడపల్లి ఆధ్వర్యం లో శ్రీ అహ్రి కిషన్, తన్వీర్, అరుణ్ శ్రీ కుమార్, అత్రి పురావై వ్యాస్ , రచన జోషి, కళాకారులూ "వివర్త" అనే అంశం పై థేమటిక్ ప్రెసెంటేషన్ ఇచ్చారు . శ్రీమతి శ్రీవల్లి గారి కళాకారులందరిని సత్కరించారు.