నాగలాపురం చిన్న పట్టు గ్రామంలో కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి యువకుడు మృతి
నాగలాపురం: యువకుడి మృతి కుటుంబ తగాదాలతో గడ్డి మందు తాగిన యువకుడు చనిపోయాడు. నాగలాపురం మండలం చిన్నాపట్టుకు చెందిన జి.శ్రీనివాసులు కుమారుడు జి. కార్తీక్(30)కి వివాహమైంది. కుటుంబ తగాదాలతో ఈనెల 10వ తేదీ గడ్డి మందు తాగాడు. అతడిని వెంటనే చెన్నై ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ మరణించాడు. ఎస్సై సునీల్ మంగళవారం కేసు నమోదు చేశారు.