మంచిర్యాల: పోడు రైతులకు పట్టాలు అందిచే వరకు బీజేపీ పోరాటం చేస్తుంది: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఆదివాసులు గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములలో గత నాలుగు నెలలుగా ఆదివాసులు వారి గ్రామాన్ని వదిలేసి జంగల్ లో పోడు భూముల్లో నివాసం ఉంటు సాగు చేసుకుంటున్న భూమిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం, ఫారెస్ట్, పోలీసులు అధికారులతో దాడి వేసి వారు సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల మహిళల అసభ్యకర వీడియోలు తీస్తూ వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.