డివిజన్ స్థాయిలో అభివృద్ధి అధికారి ఉండటం వలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. పాత జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒంగోలు డివిజన్ డెవలప్మెంట్ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏ.పీ.డీ. కార్యాలయాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖలో వినూత్న మార్పులు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.