అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో శుక్రవారం 11:30 గంటల సమయంలో ఎస్కే యూనివర్సిటీ బీసీ ఉద్యోగులు బిసి యువజన సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జైపాల్ యాదవ్, ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని మహిళల చదువు కోసం ఆయన ఎంతో కృషి చేయడం జరిగిందని అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జైపాల్ యాదవ్, ప్రభాకర్ పేర్కొన్నారు.