అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నదీలోకి వరద ఉదృతి
Eluru Urban, Eluru | Sep 16, 2025
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదీలోకి వరద నీరు చేరడంతో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్ వే నుంచి 7లక్షల 69 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టింది. రెండు నెలలుగా గోదావరి వరద తగ్గుతూ.. పెరుగుతూ కొనసాగుతోంది.