భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ గారి జీవితం ఆదర్శనీయం అని వైయస్సార్సీపి పీఏసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వైయస్సార్సీపీ నాయకులతో కలసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బెలుగుప్పలో తహసిల్దార్ అనిల్ కుమార్, కార్యాలయ సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.