పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాలతో బుధవారం ఉదయం ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుక నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ జయంతిని ఒక పండుగలా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. విశ్వకర్మ భగవానుడు కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు.