ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి స్వరూప పై తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాల అవసరాల దృశ్య కలెక్టర్ ని కోరి 30 లక్షల రూపాయలతో డైనింగ్ హాలుకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.