కదిరిలో స్వదేశీ వస్తువుల వాడకంపై బీజేపీ ఆధ్వర్యంలో అవగాహన
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని పలు కాలనీలలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం స్వదేశీ వస్తువుల వాడకం ఇంటింటా స్వదేశీ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ స్వదేశీ వస్తువులు వాడకం ద్వారా దేశానికి జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజల చేత స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రతిజ్ఞ చేయించారు.