రామాయపట్నం పోర్ట్ నిర్వాసితుల కోసం R&R ప్యాకేజీ కింద నూతనంగా నిర్మించిన కాలనీలో సోమవారం రామాలయ శంకుస్థాపన కార్యక్రమంలో MLA ఇంటూరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల కోసం భూములను త్యాగం చేసిన రైతుల కోసం అన్ని హంగులతో పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల త్యాగాల ఫలితంగానే BPCL, ఇండోసోల్ వంటి భారీ పరిశ్రమలు కందుకూరు నియోజకవర్గానికి వచ్చాయని స్పష్టం చేశారు.