ఎస్కే యూనివర్సిటీ బీఈడీ కళాశాలలో చదివిన 30 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు ఇంచార్జ్ ఉపకులపతి అనిత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటుకలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాలలో బుధవారం 11:30 గంటల సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన బిఈడి పూర్వ విద్యార్థులను సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇన్చార్జి ఉపకులపతి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విద్యార్థినిలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాలలో చదువుకున్న 30 మందికి టీచర్లుగాను కానిస్టేబుల్ గా ఉద్యోగాలు పొందడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఇంచార్జ్ ఉపకళపతి ప్రొఫెసర్ అనిత పేర్కొన్నారు.