సంగారెడ్డి: పట్టణంలో రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఢీకొట్టిన కారు, తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని ధరణి ఆసుపత్రి ముందు రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని కారు శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ఢీ కొట్టింది. దీంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై ఈ యాక్సిడెంట్ తో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్ కు పలుమార్లు ఫోన్ చేసిన అంబులెన్స్ రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.