ప్రకాశం జిల్లా దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్నట్లుగా పాఠశాల హెచ్ఎం రామాంజనేయులు తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులకు సక్రమంగా అమలు చేస్తున్నామన్నారు. నాణ్యమైన భోజనం మంచినీటి వసతి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా చక్కటి బోధనతో విద్యార్థులకు విద్యాభివృద్ధి అందిస్తున్నట్లు తెలిపారు.