జనగాం: పాలకుర్తిలో ఆర్టీవో అధికారుల ఆకస్మిక తనిఖీలు,సరైన పత్రాలు లేని పలు వాహనాలు సీజ్
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మంగళవారం ఉదయం RTO అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 15 సంవత్సరాలు పరిమితి గడువు దాటిన పలు వాహనాలను ఆర్టీవో అధికారులు సీజ్ చేశారు.వాహనాల రాంగ్ కామినేషన్,గడువు,పర్మిట్, ఓవర్ లోడ్ ఉన్న పలు వాహనాలను సీజ్ చేశారు. మూడు ట్రాక్టర్లు,మూడు బొలెరో వాహనాలు సీజ్ చేసిన ట్రైనీ మోటార్ వెహికల్ ఎంవిఐ ఇన్స్పెక్టర్ సంపత్ తెలిపారు.