రాబోయే ఎన్నికలలో ఒంగోలు ఎంపీగా తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రస్తుతం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు సోమవారం మాగుంట కార్యాలయం వద్ద జరిగిన మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారని, తన వారసుడిగా తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీలో ఉంటారని తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కూడా తెలియజేశానన్నారు. తనను ఆదరించిన విధంగానే తన కుమారుని కూడా ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నేతలు పాల్గొన